చేతివేళ్ళతో ఆరోగ్యం - 9 విసర్జన వ్యవస్థను నియంత్రించే... అపానముద్ర

అపానముద్ర


పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను చేయాలి.
చేయువిధానం :

మధ్యవ్రేలు, ఉంగరపు వ్రేలుకొనలను బొటనవ్రేలి చివరను తాకించాలి. మిగిలిన రెండు వ్రేళ్ళను నిటారుగా ఉంచాలి.

లాభాలు:

విసర్జన వ్యవస్థను నియంత్రించడం వల్ల శరీరంలోని మిగిలిన భాగాలు శుభ్రపడుతాయి.
ఈ ముద్ర ముఖ్యంగా మూత్రపిండాల మీద బాగా పనిచేస్తుంది.
మూత్రము సరిగా పోని రోగులకు, ఒకవేళ మందులతో కూడా మూత్ర విసర్జన సాఫీగా లేకుంటే రోజుకు 15 నిముషాలతో మొదలుపెట్టి 45 నిముషాలకు పెంచుకుంటూ ఈ ముద్ర వేస్తే వ్యాధి నివారింపబడుతుంది.
ప్రొస్ర్టెట్ గ్రంధి సమస్య లేనివారికి ఈ ముద్ర వేయడం వల్ల మూత్రనాళాలలో రాళ్ళు కరుగుతాయి.
ఈ ముద్ర వల్ల మూత్రము, చెమట అధిక మొత్తములో బయటకు వెడలుతుంది. దీని వల్ల శరీరం శుభ్రపడటమే కాక మనస్సులో గూడా మంచి భావాలను ఉత్పన్నం చేస్తుంది.
శరీరంలోని అపానవాయువును నియంత్రించుట వల్ల కడుపులో వాయు బాధలు నివారింపబడతాయి.
ఈ ముద్ర దంత సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
మలబద్ధకము, మొలలు మొదలైన ఆసన సంబంధ వ్యాధులు కలవారు ఈ ముద్రను రోజుకు 15 నిముషాలతో మొదలుపెట్టి 45 నిముషాలకు పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 8 అధిక బరువు తగ్గాలా? సూర్యముద్ర

సూర్యముద్ర

పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను రెండు చేతివేళ్ళతో చేయాలి.

చేసేవిధానం:

ఉంగరపువ్రేలిని బొటనవ్రేలి క్రిందభాగమును తాకించి దానిని బొటనవ్రేలితో నొక్కిఉంచాలి.

లాభాలు:

పద్మాసనంలో కూర్చోని రెండు చేతులతో ఈ ముద్ర పడితే అధిక బరువు తగ్గుతారు.
ఈ ముద్రవల్ల ధైరాయిడ్ గ్రంధులున్న చోట ఒత్తిడి పెరిగి బరువు తగ్గుతారు.
చాలా కాలం నుంచి ఉన్న మానసిక ఉద్విగ్నత తగ్గడానికి ఉపయోగపడుతుంది.
శరీరానికి మంచి శక్తిని కలిగిస్తుంది.

కాలపరిమితి: ఉదయం, సాయంత్రం 4 నిముషాల నుండి ప్రారంభించి 15 నిముషముల వరకు పెంచుకొనవలెను

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 7 గుప్పెడంత గుండెను కాపాడే.. అపానవాయుముద్ర

అపానవాయుముద్ర





పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను చేయాలి.


చేసేవిధానం:

చూపుడువ్రేలును బొటనవ్రేలి క్రిందభాగమునకు తాకించి బొటనవ్రేలు, మధ్యవ్రేలు, ఉంగరపువ్రేళ్ళ చివరలు కలిపి ఉంచాలి. చిటికెన వ్రేలు నిటారుగా ఉంచాలి.

లాభాలు :

ఈ ముద్రను మృతసంజీవిని ముద్ర లేక హృదయముద్ర అంటారు.

గుండెపోటు లక్షణాలున్నవారు ఈ ముద్రసాధన వెంటనే ప్రయత్నించండి.

రోజులో అనేకసార్లు ఈ ముద్రను అభ్యసించడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.

సాయంత్రం 15 నిముషాలు సాధన చేస్తే హృదయ సంబంధవ్యాధులు దూరమవుతాయి.

గుండెజబ్బులు గలవాళ్ళు ఈ ముద్రవేస్తూ, నియమిత ఆహారం (ఎక్కువ ఆకుకూరలు, పళ్ళు) తీసుకున్నట్లైతే పూర్తిగా ఆరోగ్యానిస్తుంది.

ఛాతిలో కొద్దిగా నొప్పి మొదలవ్వగానే ఈ ముద్రను పట్టినట్లయితే హృదయంలో అధిక వాయువును బయటకు పంపి ఉపశమనం కలుగుతుంది.

గుండె బలహానంగా ఉన్న, దడగా ఉన్న ఈ ముద్ర సాధన వల్ల పూర్తి ఆరోగ్యం లభిస్తుంది.

గాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది.

తరచూ తలనొప్పికి గురయ్యే వారికి నివారణ దొరుకుతుంది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 6 - వెంట్రుకల సమస్యలకు ప్రసన్నముద్ర

ప్రసన్నముద్ర
పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను చేయాలి.


చేయు విధానం :

పై చిత్రాన్ని చూసారు కదా!! మీ వేళ్ళగోర్లను రాపిడి (రబ్) చేయాలి. భోజనం చేసే 1/4గంట ముందు 5 నుండి 10 నిముషాల వరకూ చేయచ్చు. బాగా చలిగా అనిపించినపుడు రెండు చేతులను వేడి పుట్టంచేందుకు రాపిడి చేస్తాం కదా!! అదేవిధంగా చిత్రంలో చూపిన విధంగా వేళ్ళను ముడిచి అదేవిధంగా మీ చేతివేళ్ళ గోర్లను రాపిడి చేయాలి. సాయంత్రం పూట లేదా ఇంకేపుడైనా చేయవచ్చు. సరదాగా ఆటలా ఉంటుంది. senyum

లాభాలు:

జుట్టు ఊడటం తగ్గిస్తుంది.

జుట్టును బలంగా చేస్తుంది.

ఎక్కువగా జట్టు ఊడేవారికి దీని అభ్యాసం వల్ల క్రమేపి జుట్టు రాలటం తగ్గిస్తుంది.

జుట్టు చివర చిట్లటం వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 5

నియమం ప్రకారం ముద్రావైద్య సాధనను తెలుసుకొని ఆచరించడం వల్ల ఏ విధమైన రోగాలు దరిచేరవు మరియు రోగమున్నవారు రోగ విముక్తి కలిగించుకోవచ్చు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని పంచతత్త్వముల మధ్యన వచ్చే అసమానతలను తొలగించుట సాధ్యమగును. ఏదైన వ్యాధితో బాధపడేవారుంటే వారు వారి యొక్క మందులను వాడుతూ ఆయా వ్యాధులకు సంబంధించిన ముద్రలను కూడా చేయవచ్చు.


నిమయాలు :

1. ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు గానీ చేయవచ్చును.

2. సాధారణంగా పద్మాసనంలో కూర్చొని ముద్రలు చేపట్టడం శ్రేష్ఠం. కానీ....ఇవి ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రయాణంలో, పడుకొని యున్నా గానీ చేయవచ్చు. కాలినడక తర్వాత అయితే కొంత విశ్రాంతి తర్వాత చేయవచ్చు.

3. ముద్రలు రెండు చేతులతో చేయాలి.

4. ముద్రలను తేలికగా ఎక్కువగా వత్తిడి చేయకుండా అలవాటు చేసుకోవాలి.

5. రెండు చేతులతో ఈ ముద్రలన్నీ వీలుంటే కనీసం 45 నిముషాలు ప్రతిరోజూ అభ్యాసం చేయాలి.

6. శూన్యముద్ర, వాయుముద్రలు (త్వరలో పరిచయం చేస్తాను) మాత్రం రోగం తగ్గేంతవరకు మాత్రమే అభ్యసించాలి.


ప్రారంభ సాధకులు ముందు 10 నిముషాలలో మొదలుపెట్టి రోజూ కొద్ది నిముషాలు పెంచుకుంటూ పోవాలి. తేలికైన ముద్రలను ఉదయం 15 నిముషాలు, సాయంత్రం 15 నిముషాలు క్రమం తప్పక ఆచరించాలి. ఈ వైద్యవిధానంలో విశ్వాసం ఏ మాత్రం లేకపోయినా సాధన వల్ల ఫలితం మాత్రం తప్పక లభిస్తుంది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 4 - చెవి సమస్యలకు శూన్య ముద్ర


శూన్య ముద్ర




పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను చేయాలి.

చేసేవిధానం:

మధ్యవ్రేలితో బొటనవ్రేలు క్రింది భాగమును తాకించి దానిని బొటన వ్రేలితో నొక్కిఉంచాలి.

లాభాలు:

చెవినొప్పిని తగ్గిస్తుంది.

ఈ ముద్ర వలన చెవిపోటు కొద్ది నిముషాలలో నివారణయగును.

చెవుడును తగ్గిస్తుంది.

పుట్టుకతోరాని చెవుడును, వినికిడిలో శక్తి తగ్గినా ఈ ముద్రను రోజుకు 30 నిముషాల నుండి 60నిముషాల వరకు వేయవచ్చును.

ఆకస్మాత్తుగా వచ్చిన చెవిటితనము, మూగతనము నివారింపబడుతుంది. ఎక్కువరోజులు సాధన చేయాల్సి ఉంటుంది.

గమనిక : చెవి సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ ముద్రను వేయాలి. సమస్య తగ్గగానే ఆపివేయాలి.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 3 - మనసుకు, శరీరాన్ని శక్తిని కలుగచేసే పృద్వి ముద్ర


పృద్వి ముద్ర


పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను రెండు చేతుల వేళ్ళతో చేయాలి.

చేసేవిధానం:
ఉంగరపు వ్రేలు కొన బొటనవ్రేలితో తాకించాలి.

లాభాలు :
లివర్ ను కాపాడుతుంది.
పొట్టను కాపాడుతుంది.
ఆత్మ విశ్వాసాన్ని, తమపై తమకు నమ్మకాన్ని కలిగిస్తుంది.
మనసుకు, శరీరాన్ని శక్తిని కలుగచేస్తుంది.
చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.
ఎనర్జీని పెంపొందిస్తుంది.
ఈ ముద్ర పట్టినందువల్ల వారి ఆకృతి తగినంతగా ఏర్పడుతుంది.
శరీరంలో చైతన్యశక్తి పెరుగుతంది.
ఆధ్యాత్మికసాధనలో నిజమైన మిత్రునిలా సహకరిస్తుంది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

బట్టతలా ??

1. దానిమ్మ ఆకులు నీటితో ముద్దగా నూరి.... బట్టతల వస్తున్న ప్రదేశంలో స్కాల్ప్ పై రోజూ రబ్ చేయాలి.

ఇంకోక చిట్కా

2. బట్టతల ఉన్న ప్రదేశంలో నీరుల్లిపాయ స్లయిస్ తో బాగా రబ్ చేసి అనంతరం తేనె పూస్తుండాలి.

(వండర్ వరల్డ్ బ్యూటి టిప్స్ నుండి సేకరించినది.)

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 2 - రక్తదోషాలను తొలగించే వరుణముద్ర

వరుణ ముద్ర



పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను రెండు చేతుల వేళ్ళతో చేయాలి.


చేసేవిధానం:

బొటనవ్రేలు, చిటికెన వ్రేలు కలిపి ఉంచాలి.


లాభాలు:

చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

రక్తంలో ఉన్న దోషాలను తొలగించి, రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

శరీరక అందాన్ని పెంచుతుంది.

డయేరియా మరియు డీహైడ్రేషను తొలగిస్తుంది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

చేతివేళ్ళతో ఆరోగ్యం - 1- మానసిక శక్తి అభివృద్ధి చేసే జ్ఞానముద్ర

ఈ ముద్రలనేవి చెయ్యటం చాలా తేలిక. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సరే చెయ్యవచ్చు. కానీ పద్మాసనంలో కూర్చొని మీరు పెట్టిన ముద్రలమీద ధ్యాస ఉంచి ఒక సమయం, ఒకే స్థలంలో చేస్తే ఫలితం తొందరగా పొందవచ్చు. తూర్పుకి అభిముఖంగా కూర్చొండి. మీ చేతివేళ్ళని మరి కఠినంగా ఉంచకండి అంటే ముద్ర చేపడుతున్నాం అనే భావం మీలో రాకూడదు. అంటే తేలికగా మీకు అనిపించాలి. ముద్ర చేపట్టినపుడు మీకు చేతివేళ్ళు నొప్పిగా అనిపిస్తే ఆపివేయవచ్చు. క్రమంగా మీ శక్తానుసారం సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి.


సరే!! జ్ఞాన ముద్ర గురించి తెలుసుకుందాం.



పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను రెండు చేతి వేళ్ళతో చేయాలి.

చేసేవిధానం:

బొటనవ్రేలు, చూపుడు వ్రేలు కలిపి ఉంచాలి.

లాభాలు:

మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆధ్యాత్మిక అభివృద్ధి వంటివి మెరుగవుతాయి.
టెలిపతి వంటి శక్తులు అభివృద్ధి చెందుతాయి.
డిప్రెషన్, స్ర్టెస్, మగతగా అనిపించడం, అతినిద్ర వంటివి అదుపులోకి వస్తాయి.
విధ్యార్ధులకు ఈ ముద్ర చేపట్టడం చాలా ఉపయోగకరం.

హస్తసాముద్రిక రిత్యా జీవితరేఖ, బుధరేఖలోని లోపాలను తొలగించి, నీచ శుక్రస్థానము యొక్క అవగుణములను దూరం చేస్తుంది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments