తల వెంట్రుకల జిడ్డును పోగొట్టుకోవడానికి

కందిపప్పు 50 గ్రా
నిమ్మరసం తగినంత

ఒక పాత్రలో కందిపప్పు వేసి అది మునిగేవరకు నిమ్మరసం వేసి నానబెట్టాలి. నానిన తర్వతా మెత్తగా నూరి జిడ్డుగా వెంట్రుకలను పాయలు పాయలుగా తీసి పట్టించాలి. తర్వాత ఒక అరగంట ఆగి కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.


ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

పొడిబారిన కళ్ళ సమస్యకు

కరక్కాయ బెరడు - 5 ముక్కలు
తానికాయ బెరడు - 5 ముక్కలు
ఉసిరి కాయ బెరడు - 5 ముక్కలు

రాత్రి పూట ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసి మూతపెట్టి ఉంచి ఉదయం వేరే పాత్రలో వడకట్టి ఆ నీటితో కళ్ళను కడగాలి.

కళ్ళను మూసి కనుబొమ్మలదగ్గర నుండి కంటి క్రింద భాగం వరకూ కడగాలి.

ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

జుట్టు నల్లబడటానికి వెల్లుల్లి తైలం

ఆలివ్ ఆయిల్ 100 గ్రా
వెల్లుల్లి పై పొట్టు సుమారుగా తీసుకోండి

తయారు చేసే విధానం :
పొయ్యి మీద బాణిలి పెట్టి వెల్లుల్లి పొట్టును సన్నమంటపై వేయించాలి. అలా వేయించగా వేయించగా నల్లని పొడిగా బూడిదలా తయారయ్యేవరకూ వేయించాలి. ఆ పొడిని జల్లించండి.

అలా జల్లించిన పొడిని పావు టీ స్పూన్ తీసుకొని ఆలివ్ ఆయిల్ లో బాగా కలిసిపోయేట్టు కలిపి వారం రోజుల వరకు కదపకుండా ఉంచండి. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగించే విధానం :
రాత్రి చక్కగా నిదానంగా మాలిష్ చేస్తూ తలకు పట్టించాలి. మరుసటి రోజు కుంకుడుకాయలు లేదా శీకాయలతో తలస్నానం చేయడం ద్వారా క్రమంగా నల్లబడుతుంది.

ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

మలబద్ధకాన్నీ నివారించే గులాభి లేహ్యం

ఎండిన నాటు ఎర్ర గులాబిరేకల పొడి - 100 గ్రా
వేయించిన సొంఠి పొడి - 100 గ్రా
సునాముఖి పొడి - 100 గ్రా
కిస్ మిస్ - 100 గ్రా
సైందవలవణం పొడి - 100 గ్రా
తేనె తగినంత

తయారుచేసే విధానం :
ఈ పొడులన్నింటిలో కిస్ మిస్ పళ్ళు వేసి కొంచెం కొంచెం తేనె అందులో కలుపుకుంటూ మెత్తని ముద్దగా నూరి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. సేవించేటపుడు తడి లేకుండా పొడిగా ఉన్న స్పూన్ మాత్రమే ఉపయోగించాలి.

సేవించే విధానం :
వయసును బట్టి పిల్లలు 10 గ్రా పెద్దలు 10 నుంచి 20 గ్రా రాత్రి ఆహారం తిన్న 2 గంటల తర్వాత నిద్రపోయే ముందు చప్పరించి తిని మంచినీళ్ళు త్రాగాలి.

రోజూ వేసుకోవచ్చు కానీ ఇది వేసుకొనేటప్పటికి బోజనం చేసి 2 గంటలు అయిఉండాలి.

ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

అర్శమొలల నివారణకు మాత్రలు

కుంకుళ్ళ పై బెరడు బాగా నలగగొట్టినది - 100 గ్రా తీసుకొని దాన్ని కొంచెం కొంచెంగా నీరు పొసి ముద్దగా నూరుకోవాలి. వీటిని చిన్న శనగగింజలంత మాత్రలుగా చేసుకొని బాగా గాలికి తగిలే చోట పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో ఆరబెట్టాలి. మొత్తం నీరు అంతా ఆవిరి అయిపోయేలా సుమారు 4,5 రోజులు ఆరబెట్టి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.

సేవించే విధానం:
రక్తమొలలు గలవారు మంచి నీటితో 3 పూటలు ఆహారానికి అరగంట ముందు 1 మాత్రను వేసుకోవాలి.
ఎండుమొలలు గలవారు పలుచని తీయని మజ్జిగతో 3 పూటలు ఆహారానికి అరగంట ముందు 1 మాత్రను వేసుకోవాలి.

అసలు మొలలు ఎందుకు వస్తాయి?
రోజులో ఎక్కువగా కూర్చోనేవాళ్ళకు, మాంసం, మసాలాలు ఎక్కువగా వాడేవారికి, రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి, సూర్యోదయం తర్వాత లేచేవాళ్ళకు, టీ, కాఫీలు, మద్యపానం అధికంగా సేవించేవారికి, ప్రకృతి వ్యతిరేక జీవన విధానం వల్ల వస్తాయి.

ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

పులిపిర్లు తొలగించుకోవటానికి

చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని ఒక వైపు పెన్సిల్ మొన చెక్కినట్టుగా అల్లాన్ని చెక్కాలి.

తర్వాత కొత్త సున్నంలో ఆ అల్లం మొనను అద్ది పులిపిర్లపై రాయాలి.

ఏల్చూరి గారి జీ-తెలుగు 8-1-2009 కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

పొట్ట తగ్గడం కోసం

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మబద్ద రసం పిండి ఒక స్పూన్ తేనె కలిపి త్రాగాలి.

సేవించే విధానం :
రోజుకు మూడు సార్లు త్రాగాలి. కానీ, ఇది త్రాగే ఒక గంట ముందు ఏమి తిని ఉండకూడదు. అలాగే త్రాగిన ఒక గంట తర్వాత కూడా ఏమి తినరాదు.

ఇది మొదలు పెట్టిన మొదటి రోజున ఒక పూట మాత్రమే అంటే ఉదయం పరగడుపున త్రాగాలి.
రెండవ రోజు పైన చెప్పిన విధంగా ఉదయం మరియు రాత్రి త్రాగాలి.
మూడవ రోజు ఉదయం, మధ్యాహ్నం, మరియు రాత్రి త్రాగాలి.

ఉదరంలో ఏమైనా సమస్యలున్నవారు చిన్న గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు నిమ్మబద్ద రసం మరియు సగం స్పూన్ తేనె కలిపి త్రాగవచ్చు.

నీరు మరీ ఎక్కువగా వేడి చేయరాదు... గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.

ఏల్చూరి గారి జీ-తెలుగు 9-1-2009 కార్యక్రమం నుంచి సేకరించినది.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments