ఏలాది లేహ్యం

చిన్న ఏలకులు, ఆకుపత్రి, దాల్చినచెక్క, సన్నపిప్పళ్ళు ఒక్కొక్కటి 20గ్రా చొప్పున తీసుకోవాలి. అతిమధురం, గింజలు తీసిన ఎండుకర్జూరాలు, గింజలు తీసిన ద్రాక్ష, ఎండుకిస్ మిస్ పండ్లు, ఇవి ఒక్కొక్కటి 40 గ్రా చొప్పున తీసుకోవాలి.

తయారీ విధానము :
పైన తెలిపిన పదార్ధాలను పొడి చేసుకొనవలసిన వాటిని మెత్తగా దంచి పొడిగా మార్చుకోవాలి. ఆ పొడులను మిగిలిన పండ్లను మొత్తము కలిపి రోటిలో వేసి అన్నీ పదార్ధాలు బాగా కలిసిపోయేవరకు దంచి ఆ ముద్దలో తగినంత పట్టుతేనే కలిపి మళ్ళీదంచి లేహ్యంలాగా చేసి ఒక గాజుపాత్రలో నిలువ ఉంచుకోవాలి.

మోతాదు :
రోజూ రెండుపూటలా పూటలకు 10గ్రా మోతాదుగా తినాలి.

ఉపయోగాలు :
దగ్గు, ఉబ్బసము, జ్వరము, ఎక్కిళ్ళు, వాంతులు, మూర్చ, రక్తపైత్యము, అతిదాహము, నోటిలో రుచిలేకపోవడం, క్షయరోగము, కడుపులో బల్లలు పెరగటం, కీళ్ళవాతము, బొంగురుగొంతు మొదలైన సమస్యలున్నవారు దీనిని ఉపయోగించుకొని ఆయా సమస్యల నుండి విముక్తిపొందడమేకాక శరీరానికి మంచి బలము పుష్ఠి, వీర్యవృద్ధి కూడా కలుగుతాయి.

సేకరణ : అందరికి ఆయుర్వేదం ఫిబ్రవరి 2008

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

కాల్ సెంటర్

నెట్ డిస్కనెక్ట్ అయ్యి కాల్ సెంటర్ వాళ్ళకు ఫోన్ చేస్తే... వారి ఇంగ్లీషును అందుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. భాష అంటే పక్క వాళ్ళకు అర్ధం అయినా కాకున్నా గడగడ మాట్లాడేదేనా??? ఎలాగోలా కష్టపడి అర్ధం చేసుకుంటే... వాటిలో కొన్ని టెక్నికల్ పదాలు ఉంటాయి... అవి ఎలా తెలుస్తాయి??

ఏదో అమెరికాలో ఉన్న కొడుకుతోనో, కూతురుతోనో మాట్లాడుకుందాం... అనే పెద్దవాళ్ళకు ఇలాంటి పరిస్థితి వస్తే... వాళ్ళకు ఆ టెక్నికల్ పదాలు ఎలా అర్ధం అవుతాయి? ఇంగ్లీషు సరే నా లాంటి అజ్ఞానులకు రాదు.. పోనీ తెలుగులో మాట్లాడినా ఇదే గోల. వాళ్ళపాటికి వాళ్ళు మాట్లాడుకుపోతారు... మాకు మాత్రం బ్రెయిన్ సెంటర్లో కాలుతుంది.

చెప్పుకుంటే సిగ్గుచేటు... మన భాష రాకున్నా, అర్ధం కాకున్నా పర్వాలేదు కానీ.... తెల్లోడి భాష అర్ధం కాలేదంటే... ఎంత మంది మీలో నన్ను చదువురాని, చదవలేని నిరక్షరకుక్షి అని హీనంగా ఓ చూపు చూసి పోతారో!!!

చివరిగా వారి ఇంగ్లీషును అర్ధం చేసుకోవాలంటే ఏమి చెయ్యాలో సలహా చెప్పగలరు... ఛానల్స్ లో చూసే ఇంగ్లీషు న్యూస్ మాత్రం అర్ధమవుతాయి.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

జామాకుతో... మధుమేహాం అదుపు

బాగా ఆరోగ్యంగా ఉన్న జామచెట్టునుండి, సాయంత్రం సూర్యాస్తమయంలోపల చెట్టుకు నమస్కరించి, మీ మధుమేహరోగం గురించి చెప్పి ఆరోగ్యం నుండి కాపాడవలసిందిగా ప్రార్ధన చేసి, ఆ చెట్టు నుండి ఒక ఆకును తీసుకోవాలి. మరీ లేత ఆకు కాకుండా, మరీ ముదురాకు కాకుండా మధ్యరకంగా ఉండాలి. దాన్ని దుమ్ములేకుండా కడగాలి. ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిలో ఆ ఆకును రాత్రిపూట వేసి మూతపెట్టి ఉంచాలి.


ఉదయం దంతధావనం కాగానే ఆ ఆకును తీసివేసి ఆ నీటిని నిదానంగా కొంచెంకొంచెం తాగాలి. ఇది తాగిన ఒకగంటవరకు మరేమీ తాగకూడదు, తినకూడదు.


ఈ విధంగా వరుసగా 30 నుండి 40 రోజుల వరకు తాగుచూ ఉంటే ఆశ్చర్యకరంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.


***
ఇదేవిధంగా అల్లనేరేడాకుతో కూడా చేయవచ్చు.

సేకరణ : అందరికి ఆయుర్వేదం ఫిబ్రవరి 2008

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

అమ్మా, నాన్నలా? మమ్మీ, డాడీలా?

రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఎందుకు లేదు? తెలుగోళ్ళకు, తెల్లోళ్ళకు ఉన్నంత తేడా ఉంది. మీ కంప్యూటర్ కు తెలుగొచ్చా? అని బ్యానర్ పెట్టినట్టు మీ పిల్లలకు అమ్మ, నాన్నఅని పిలవడం వచ్చా? అని కూడా పెట్టాలేమో!! garupale

మన రాష్ర్టంలో ఉన్నంతవరకూ మన భాష గుర్తురాదు. విదేశాలు వెళ్ళగానే అక్కడ తెలుగు పండుగలు జరపడం.. (అంటే ఇక్కడ కన్నా ఎక్కువ సంప్రదాయాలు పాటించడం వంటివి) తెలుగు భాష నేర్చుకోవడం... నేర్పించడం వంటి ‘పిచ్చి’ అభిమానం ఎందుకు పుట్టుకొస్తుందో!! అదే ప్రజలు ఇక్కడకొస్తే అక్కడి వయ్యారాల ఇంగిలిపీసు వలకబోసేస్తారుgigil. ప్రజలంతా ఇపుడు యుద్దప్రాతిపదికన తెలుగు భాషను పరిరక్షించేస్తున్నారు... ముందు ఇలాంటి (మమ్మి, డాడీ, ఆంటి, అంకుల్) పిలుపుల్లో మన ఇంట్లో నుంచి మార్పు తేగలిగితే మిగిలినది దానంతట అదే సరిఅవుతుంది.

పక్కంటివాళ్ళను, ఎవరైనా కొత్తవాళ్ళను ఆంటి, అంకుల్ అని పిలవడం వరకూ బాగుంది, ఎందుకంటే వారిని ఏ వరస ప్రకారం పిలవాలో తెలియదు కాబట్టి. కానీ, మన బంధువుల్లో ఉన్నవాళ్ళు... వాళ్ళు ఏ వరసవుతారో తెలిసినా, వాళ్ళను కూడా ఆంటి, అంకుల్ అని పిలవడం.. ఎంతవరకూ బాగుంటుంది? మా బంధువుల్లో ఒకరు పెద్దనాన్న, పెద్దమ్మలను Big Daddy, Big Mom అని పిలుస్తారు... మరీ బడాయి ihikhik .

మాకు తెలిసిన ఓ పెద్దాయన మనుమరాలు అమెరికా నుంచి వచ్చింది... 4 ఏళ్ళు ఉంటాయి. చక్కటి తెలుగు మాట్లాడుతుంది... మా అందరి ముందు బడాయి కోసం.... ఆ అమ్మాయి తెలుగు మాట్లాడినపుడల్లా ఆ పెద్దాయన ఇంగ్లీషులో మాట్లాడు, ఇంగ్లీషులో మాట్లాడు అని అంటున్నాడు. ఇలాంటి పిల్లలు అమెరికాలో తెలుగు నేర్చుకోవడం ఓ పెద్ద గొప్ప, ప్రపంచ వింత... అదే తెలుగు ఇక్కడ మాట్లాడితే మాట్లాడనివ్వరు. marah

ఇక అంకుల్ గురించి మా సోషియాలజీ మాష్టారు చెప్పిన ఓ సంగతి గుర్తుకొస్తుంది...
ఓ 18 ఏళ్ళ అమ్మాయి పక్కింట్లో ఉండే ఓ 40 ఏళ్ళతన్ని అంకుల్ అని పిలిచిందంట!! అపుడు ఆ ఇంటి మీద పెంకులు గాడు పళ్ళు ఇకిలిస్తు... అంకుల్ కి చిన్నాన్న, మామయ్య అనే రెండర్ధాలు ఉన్నాయి.. నువ్వు ఏ అర్ధంతో పిలిచావో చెపితే నీతో నా ‘ప్రవర్తన’ ఆ విధంగా ఉంటుంది అన్నాడట. ఇక ఆంటీ అంటే కొన్ని సినిమాల్లో విన్న ద్వంద్వార్ధాల వల్ల ఆంటీ అనే మాటే పెద్ద బూతులా వినిపిస్తుంది + ఒకసారి బస్టాపులో నిలబడినపుడు కొందరి పోకిరీ వెధవల మాటలవల్ల కూడా అది నిర్ధారణ అయింది (ఇక్కడ రాయలేనిది). xpasti diam

నాకు తెలిసిన స్నేహితుల్లో కొందరు అమ్మ, నాన్న అనే పిలిపించుకుంటారు... ఏంటి అని అడిగితే... ఈజిప్టు మమ్మీలు, కరీమ్ బీడీలు మనకెందుకమ్మా!! అమ్మ, నాన్న అంటేనే బాగుంది అంటారు. మా ఇంట్లో కూడా అమ్మ, నాన్న అనే పిలుస్తాము... రేపు మా పిల్లలు కూడా అంతే!! senyumkenyit

మీరంతా అమ్మ, నాన్న అని పిలిచి దయచేసి మీ పిల్లల చేత మమ్మి, డాడీ అని పిలిపించుకోకండి. తెలుగు భాషకు ఓ పెద్ద గొప్ప సేవ చెయ్యలేకపోయినా... ఇలాంటివి మార్చగలం కదా!!! senyum.

14 comments:

సుజాత చెప్పారు...

మా అమ్మాయి మమ్మల్ని అమ్మ, నాన్న గారు అనే పిలుస్తుంది. అమెరికన్స్ ముందు అయినా సరే!(నాన్న"గారూ" ఏమిటి పెద్ద గొప్ప అనకండి, నాకు అలాగే అలవాటు మా నాన్నగారి విషయంలో! తనకీ అలాగే అలవాటు చేసాను)

హర్షోల్లాసం చెప్పారు...

మేము మా అమ్మా, నాన్న లని ,అమ్మా ,నాన్నా అనీ పిలుస్తాము.తదుపరి మా పిల్లల తో కూడా అలాగే పిలిపించుకుంటాము.కాని ఈ విషయంలో మాత్రం నావారకు ఏమనిపిస్తుందంటే మనమే వాళ్ళకి చిన్నప్పటినుంచి(మాటలు వచ్చేటప్పటినుంచి) చెప్పాలి.అప్పుడే వళ్ళు దాన్ని అభ్యసిస్తారు.నావరకు(personal gaa) మాత్రం నాన్న ని నాన్నా అనే పిలవాలని వుంటుంది "నాన్నగారు" అనటానికి నేను వ్యతిరేకిని.

మధుర వాణి చెప్పారు...

అమ్మా నాన్నలకే నా ఓటు కూడా..! కానీ.. అదేంటో చిత్రంగా నేను అమ్మా, డాడీ అని పిలుస్తాను. ఎందుకు అలా అలవాటయిందో మరి చిన్నప్పుడు నాకు తెలీదు.
కాకపోతే మధ్య మధ్యలో.. నాన్నా అని కూడా అంటుంటాను. కానీ.. అమ్మ, నాన్న అంటేనే చక్కగా ఉంటుంది. అది మాత్రం నిజం :)

చదువరి చెప్పారు...

"Big Daddy, Big Mom" :) :)

కొత్త పాళీ చెప్పారు...

మమ్మీ డాడీ అని పిలిస్తూ కూడా తెలుగు భాష అన్నా, సాహిత్యం అన్నా ఎనలేని ప్రేమ ఉన్న వ్యక్తులు చాలా మంది నాకు తెలుసు.
భాష వాడుక గురించిన బహిరంగ చర్చలో ఈ మమ్మీ డాడీ అనేది మాతృభాష అంటే ఏమాత్రం లక్ష్యం లేని ఒక ఆలోచనా విధానానికి, ఒక జీవన విధానానికి ప్రతీక అయి కూర్చుంది.
కేవలం పిలుపుల్లో మార్పు వచ్చినంత మాత్రాన భాష పట్ల ప్రజల ప్రవర్తన మారిపోదు. కాకపోతే మార్పు ఇంటిలోనించి మొదలవ్వాలనే ప్రతిపాదనతో మాత్రం నేను ఏకీభవిస్తాను.
అంకుల్ .. అంటీ .. అది వేరే ఘోష.

K చెప్పారు...

మీరు బ్లాగిందంతా ఒక ఎత్తు అయితే, కొందరు తల్లితండ్రులు పిల్లలతో పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడటం ఇంకొక ఎత్తు. అలాంటి తల్లితండ్రులని చూసినప్పుడు నాకు ఎలాంటి తిక్క రేగుతుందంటే....

bhavani చెప్పారు...

నేను మమ్మీ, డాడీ అనే పిలుస్తాను.
నాకు అలా పిలిస్తేనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అదొక అలవాటు. అంతే.
నా వరకైతే, దీనికీ, భాషకీ ఏ సంబంధమూ లేదు. పైగా శ్రీకాకుళం మాండలికాన్ని ఎక్కువగా వినటనికీ, మాట్లాడటానికీ ఇష్టపడతాను. నేను నా ఎం.ఎ లో వ్రాసిన మొదటి టెర్మ్ పేపర్ "శ్రీకాకుళం మాండలికం" పైన.
ఇంగ్లీషులో ఎన్నో అరువు తెచ్చుకున్న పదాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఇంగ్లీషులో ఇంగ్లీషు శాతం ఎంతో చెప్పటం కష్టమే.
(http://www.ruf.rice.edu/~kemmer/Words/loanwords.html). అయినప్పటికీ ఇంగ్లీషు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు రాలేదంటారు? కేవలం అది అంతర్జాతీయ భాషగా ఎదగడం మూలంగానే కాదు. ఆ భాషలో నేను ఎప్పుడో ఉన్న cultural Terms మాత్రమే కాక, కొత్త కొత్త విషయాల(సైన్స్ అండ్ టెక్నాలజీ )గురించి కూడా మాట్లాడగలను. ఆ వెసులుబాటు నాకు మాతృభాషలో ఉంటే, నేను అందులోనే మాట్లాడుతాను.
తెలుగు అభివృద్ది చెందటం అంటే ఈ కొత్త విషయాలని మనం మాట్లాడుకునేలా చేయటం. లేకున్నా ఆ భాషని మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు బ్రతుకుతుంది. కేవలం, అరువు
తెచ్చుకున్న పదాల వల్ల మన జీవితాల్లో తెలుగుకున్న
ప్రాముఖ్యానికి ఏమీ కాదు.

sri చెప్పారు...

using your emoticons seems very sweet to me !

nice post !

Sadhu.Sree Vaishnavi చెప్పారు...

అమ్మా, నాన్నలా ? మమ్మీ , డాడీలా? పొస్ట్ చాలా బాగుంది. నేను అయితే అమ్మ, నాన్న అని పిలిచేదాన్ని. స్కూల్లో ఇంగ్లీష్ లో మాట్లాడాలనె నియమం వుంది. మా స్కూల్లో. అమ్మ నాన్న అంటే కొడతారు కూడా. ఇంట్లో ఏమో అమ్మా అని పిలవమంటారు. అమ్మ అనే పిలుపులొ తియ్యదనం వుంది . కానీ తప్పదు కదా . నేను అయితే ఎందుకంత చికాకనీ ఇంట్లో అమ్మ బయట మమ్మీ. అంతే అందరూ సంతోషం .
మంచి పొస్ట్ చాలా బాగుంది. thank you bye.

|| వాణి || చెప్పారు...

నా పరిధిలో జరిగిన అంశాలను తీసుకొని నేను రాసిన టపా ఇది..
నాతో పాటు చదివే అమ్మాయి ఉంది... తెలుగు అంటే అదో చండాలం అన్నట్టు మాట్లాడుతుంది... చివరాఖరికి తేలిందేంటంటే... ఆమెకు అటు ఇంగ్లీషు సరిగ్గా రాదు.. తెలుగు సరిగ్గా రాదు.. అలా చులకనగా మాట్లాడుతుంటే మనస్సు చివుక్కుమంటుంది. పోనీ చెబుదామంటే... ఆమె గొప్పలు, గప్పాలు వినేసరికే మాకు సమయం సరిపోదు.. మొన్ననే 2వ సంవత్సరం డిగ్రీ రాసాము.. తెలుగులో నేను తప్పుతానేమో అని గొప్పగా చెప్పుకుంటుంది... :-(. పోనీ ఇంగ్లీషుమీడియం కదా అంటే గత సంవత్సరం అటు తెలుగు ఇటు ఇంగ్లీషు పాస్ మార్కులతో పాసయ్యింది.
నేను ఇపుడు తెలుగు మీడియం చదువుతున్నాను.. నా పుస్తకాలు, నా మీడియం చూసి మా ఆపీసులో వాళ్ళే చాలా వెటకారంగా, వెక్కిరింతగా మాట్లాడారు.. ఆ రోజు ఏడ్చాను కూడా... చెప్పుకుంటూ పోతే చాలా... వాళ్ళని ఏదైనా ఇంగ్లీష్ పదానికి అర్ధం చెప్పమంటే... తెలుగులో చెప్పడం రాదు అంటారు. నా భాషే నాకు సరిగ్గా రాకపోతే వేరే భాష ఏమీ నేర్చుకోగలను?
ఓహ్.. అంశం అమ్మా, నాన్నల నుంచి భాషకు మళ్ళింది....

సుజాత గారు
:-) చాల సంతోషం

హర్షోల్లాసం గారు
అవునండీ చిన్నప్పటినుండి అలవాటు చేయాలి. ‘నాన్నగారు’ పిలవటానికి నేను వ్యతిరేకం కాకపోయినా మా నాన్నే అలా పిలిపించుకోవటానికి ఇష్టపడేవారు కాదు.. శ్రీశ్రీ గారి రాసిన ఏదో పుస్తకంలో నాన్న అనేది దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది.. నాన్నగారు అంటే ఎవరో బయటవాళ్ళను పిలిచినట్టుగా ఉంటుంది.. ‘మన’ అనుకున్నపుడు ‘గారు’ అని పిలవవం కదా!! అని ఉందంట.. అందుకే నాన్న అనే పిలిచేవాళ్ళం.

మధురవాణి గారు
:-)

చదువరి గారు
పిన్నిని పాపం little mom లేదా small mom అని పిలవడం లేదు రక్షించారు.

కొత్తపాళీ గారు
భాషపై ప్రేమ ఉన్నవాళ్ళు , వాళ్ళు పిలవలేకపోయినా వాళ్ళ పిల్లల చేతయిన పిలిపించుకుంటే బాగుంటుంది అని నా ఉద్ధేశ్యం... పరభాష వాళ్ళు ఇక్కడకొస్తే వాళ్ళు అమ్మ, నాన్న అలవాటు చేసుకోరుగా... అలాగే మనవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. సాహిత్యం పై ఉన్న ప్రేమ ఇలాంటి చిన్నవాటిల్లో కూడా చూపించొచ్చు కదా!! మీలాంటి గొప్పవాళ్ళకు చెప్పేంత భాష నా దగ్గర లేదు..

K గారు,
పక్కన నాలాంటి ఇంగ్లీషు రాని మొహాలు ఏడిస్తే... వాళ్ళకు ఇంక పండగ.. మాలాంటి వాళ్ళు ఉన్నపుడు ఇలాంటి వాళ్ళు ఇంక ఎక్కువ చేస్తారు... తిక్కరేగినా తిట్టుకోవడం తప్ప ఏం చేయగలం చెప్పండి? :-(

Bhavani గారు,
భాషలో వెసులుబాసును వెతుక్కోవడం అనేది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. చిన్న చిన్న వాటినే మార్చేస్తున్నారు కదా!! ఇంక మాట్లాడేవారు ఎక్కడ ఉంటారు? మమ్మీ, డాడి అని పిలవటం అనేది ఇంక మీ వ్యక్తిగత విషయం. ఇలాగే పిలవాలి అని మీపై అధికారం చెలాయించలేనుగా!!

Sri గారు,
యాహు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం.. మొత్తానికి నెట్ లో వెతికి నా టపాల్లో పెట్టుకొనే విధంగా చేసుకున్నాను.

Sadhu.Sree Vaishnavi గారు
బయట ఇలాంటి కొన్ని కష్టాలు తప్పవు.. అయినా ఇంట్లో అమ్మ అని పిలుస్తున్నారు.. సంతోషం :-) ‘అమ్మ అనే పిలుపులొ తియ్యదనం వుంది’ అవును అందుకేగా ఈ టపా.

సుజాత చెప్పారు...

మా పెదనాన్న గారు తెలుగు లెక్చరర్ గా రిటైర్ అయ్యారు. నోరు విప్పితే పాండిత్యం, తెలుగు ఉద్ధరణ గురించి మాట్లాడతాడు! పిల్లలు మాత్రం మమ్మీ డాడీ అంటూ పిలుస్తుంటారు. భాష మీద అంత ప్రేమ ఉన్న వారు అమ్మ నాన్న అని పిల్లలకు ఎందుకు అలవాటు చెయ్యలేదంటే..."వాళ్లకలా ఇష్టం!, వాళ్ళ ముచ్చట నేనెందుకు కాదనాలి?" అంటాడు. ఇదీ పరిస్థితి!

HAREPHALA చెప్పారు...

మీరు వ్రాసినదంతా చాలా బాగుంది.అదే ఉద్దేశ్యం తో ఈ మధ్యన ఒక ప్రముఖ తెలుగు రచయిత గారికి ఒక మెయిల్ తెలుగు లో పంపాను.ఆయన నుండి తెలుగు లో జవాబు ఆశించాను. కానీ ఆయన ఆంగ్లం లో జవాబు ఇచ్చారు.నేను చాలా నిరాశ చెందాను.బయట చెప్పే ఖబుర్లు ఆచరణ లో పెట్టి ఉంటే చాలా బాగుండేది .నేను ఆంగ్లం లో రా య లేక కాదు ,ఈ మధ్యన వచ్చిన భాషాభిమానంతో తెలుగు లేఖిని ద్వారా తెలుగు లో వ్రాయడం నేర్చుకొన్నాను.మూడు నెలలో టైప్ చేయడం నేర్చుకొని ఈ కార్యక్రమాలలో పాల్గొనే ఆనందం అనుభవిస్తున్నాను.నేను న్లభై అయిదు సంవత్సరాలు రక్షా ఉత్పాదన శాఖ లో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను.

|| వాణి || చెప్పారు...

ఇంత పెద్దవారు, అంత ఉన్నత పదవి నిర్వహించినవారు, జీవితంలో అనుభవజ్ఞలైన మీకు నేను రాసింది నచ్చడం ముందుగా నా అదృష్టం.
ఇక కొందరి సాహిత్యసేవ, భాషాభిమానం ఇవన్నీ బయటవారి మెప్పుకోసమేనేమో!!! అలాంటివారిని వేలెత్తి చూపే అర్హత కూడా లేనిదాన్ని ఎందుకంటే నాకేమీ గొప్ప తెలుగు రాదు. కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలను గమనిస్తూ ఆ విధంగా భాషాభిమానం మనం ప్రకటించవచ్చు. కాకపోతే ఇలాంటివాటికి బయట మెచ్చుకొని మేకతోలు కప్పేవాళ్ళు ఉండరు. నేను సాహిత్యసేవ చేస్తున్నాను అంటే సన్మానాలు చేస్తారు కానీ... మా తల్లితండ్రులను అమ్మ, నాన్న అని పిలుస్తున్నాను లేదా మా పిల్లల చేత అమ్మ, నాన్న అని పిలిపించుకుంటున్నాము అంటే ఎవరైనా సన్మానాలు చేస్తారా? గుర్తిస్తారా?

sanjay చెప్పారు...

meru chala manchi vishayam chepparu
amma ani pilusthe chala baguntundi, manam gayam inappudu amma ani pilusthamu kani mumy ani notiventa radhu ,

amma ane padamloni kamadanam denilo ledhu

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

సుమన్ గారు E-TVలో మీ సీరియల్స్ లేక మాలాంటి అభిమానులు :-((

పాపం బ్లాగ్లోకంలో అంతా సుమన్ గారికి విరోధులే... నేను తప్ప sengihnampakgigi... సుమన్, ప్రభాకరు మంచి దోస్త్ లనీ... ఈ-టి.వి కి ఇన్ని రాజకీయాలున్నాయని బ్లాగ్ టపాల ద్వారానే తెలిసింది. కాకపోతే ఓ డౌట్ మాత్రం వచ్చేది... ఎపుడంటే... E-TV అవార్డుల పంక్షన్ కు అన్ని అవార్డులు సుమన్, ప్రభాకర్ లకు మాత్రమే వచ్చేవేంటబ్బా.... అని...garupaleకానీ బ్లాగ్ ల ద్వారా నా సందేహాం తీరిందనుకోండి.

గత సంవత్సరం పంక్షన్ కి అనుకుంటా... సుమ యాంకరింగ్ చేస్తుంది. ప్రభాకర్ కు ముందే తెలుసేమో E-TV బెస్ట్ యాంకర్ అవార్డు తనకే ఇస్తారని... సుమ ఫీల్ అవుతుందేమోనని కాసేపు సోపు వేసాడుgile

ఇంతకీ సుమన్ సీరియల్స్ గురించి చెప్పొచ్చేదేంటంటే...
నేను పెద్ద ఫ్యాన్ ని... (స్విచ్ వెయ్యగానే తిరిగే ఫ్యాన్ ని కాదు... విసురుకుంటే తప్ప తిరగని తాటాకు ఫ్యాన్ ని) kenyit

ఎందుకంటరా... ఆ సీరియల్స్ లోని సెంటి‘మెంటల్’ డ్రామాలు చూసి మాకు తెగ నవ్వు వచ్చేది. ఆ మధ్య... మధ్యలో ఆగిపోయిన సీరియల్ ‘జీవితం’ jelir గురించి... దాంట్లో ఓ తల్లి పాత్ర... తండ్రి ఎవరో చెప్పకుండా పిల్లలను పెంచుతుంది. కూతురు మా తండ్రి ఎవరూ అని అడగడం ఆలస్యం పొగిలి పొగిలి ఏడుస్తూ కుండల కుండల కన్నీళ్ళు మేకప్ చెరగకుండా కార్చేసేది. ఇంక చుట్టు పక్కల వాళ్ళు ఏదైనా ఎగతాళిగా మాట్లాడితే.... రయ్యిమంటూ దూసుకెళ్ళి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని...
వెన్నపాల
కన్నెలోల
పాపాలన్నీ నా పాల
ఈ శాపాలన్నీ నా కేల
కోకొ కోలా
హు!!! మరీ ఇంత ప్రాస చూసుకొని అన్ని కష్టాల్లో కూడా మేకప్ చెదరకుండా పాట పాడటమంటే తమాషా అనుకుంటున్నారా???

ఇక దాంట్లో కామెడి....jelir
కామెడి అంటే మరీ ఇంత కామెడీగా చెయ్యోచ్చ అన్నట్లు ఉండేది. పాపం నటించేవాళ్ళు 10 ఎకరాల కామెడి పండిద్దాం అన్నట్లు చేసే కామెడికి ఫుల్ నవ్వు... మాకు. ఇంక ప్రభాకర్ అ‘మాయ’కుడుగా నటించాడు... చూసే మొహాలు పెద్ద పిచ్చి మొహాలు... ప్చ్!!! డైలాగ్ చెప్పడం మొదలుపెట్టారంటే... ఎప్పటికి ఆపుతారా అంటే... ఎప్పటికో ఆపేవాళ్ళు... పాపం అచ్యుత్.....సుమన్ ఏడుపు సీరియల్స్ లో నటించే గుండె నొప్పి వచ్చేందేమో అని నా డౌట్.

ఈ ఏడుపు గొట్టు డ్రామాలు చూసి మనసు చలించకపోగా... ఆ అచ్చమైన, స్వచ్చమైన డైలాగులకు... ఆ ప్రాస పాటలకు... కామెడి లేని కామెడికి ఫుల్ నవ్వు వచ్చేది. ఇపుడు ఆ నవ్వులన్నీ అటకెక్కాయి. అటక మీద మిఠాయి పొట్లం తియ్యాలంటే సుమన్ రావాల్సిందే sedih

ఏంటో వాళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ అన్ని నాసిగా, ముతకగా అన్నట్లు ఉండేది. ఇపుడు E-TVకి మాంచి రిచ్ లుక్ వచ్చిందనిపిస్తుంది.

సుమన్ గారు E-TV వద్దులెండి... మీరు వేరే ఛానల్ మొదలుపెట్టండి. మీ ఛానల్ కి రేటింగ్స్, యాడ్స్ లేకపోయినా మాలాంటి తాటాకు ఫ్యాన్స్ ఎపుడూ మీ వెంటే ఉంటారు... senyumkenyit

11 comments:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

సుమన్ గారు(?), పిలుపు ఎందుకో కొత్తగా అనిపినించింది....
ఆయన సీరియల్లు లేకపోవడం వల్ల కొన్ని హస్య టపాలు లేకుండా పోయాయి.. అందుకోసం నాకు భాదగానే ఉంది...

Manohar చెప్పారు...

నేను కూడా ఈ-టివి కి పెద్ద ఫ్యాన్ ని .
బాలకృష్ణ సినిమా సంవత్సరానికి ఒకటే వస్తుంది, కానీ సుమన్ సీరియల్స్ -- రోజూ వస్తాయి కదా!
సుమన్ లేకపోయేసరికి ఈ-టివి చూడడమే మానేశా.

సుజాత చెప్పారు...

ఆ పాట ఇదీ! ఆ మధ్య దీని మీద సుమన్ సాహిత్య ఝరి మీద ఒక టపా రాద్దామని పాట కాపీ చేసి ఉంచాను. ఇంతలో సుమన్ "విధి" వక్రించి "జీవితం" "పద్మవ్యూహం" లో చిక్కుకుంది. చూశారా సుమన్ పేరెత్తితే నాక్కూడా కవిత్వం వచ్చేస్తోంది.

చిన్ని గోపాలా
ఇన్ని కోపాలా
పూజలో లోపాలా
పూర్వ జన్మ పాపాలా
విన్నపాలన్ని మన్నుపాలేనా ఓ వెన్నబాలా కన్నె బాలా ...! హమ్మో ఇక నా వల్ల కాదు.

అది సరే, జీవితం మీద విసిగిపోయినావిడ విషాద గీతం పాడుకోకుండా అదేదో కృష్ణుడు పనీ పాటా లేకుండా ఆమె మీద అలిగినట్టు, అలక తీర్చాడానికి ఈ పాట పాడినట్టూ...ఏమిటో ఈ గోల!

ఈ టపా సుమన్ కి పంపించే ఏర్పాటు చేసారంటే మర్యాదగా ఉండదు మరి. ఏదో మనశ్శాంతిగా ఇలా బతకనివ్వండి.

పరిమళం చెప్పారు...

నేను సుమన్ గారి కృష్ణుడి వేషం చూసి (ఎన్.టి .ఆర్ ని మర్చిపోయా )ఫాన్ని ఐపోయా .ఇక ప్రభాకరన్నయ్య ....పాపం జీ తెలుగు గతి ఏం కానుందో ?అన్నట్టు మీ టపా మధ్యన స్మైలీస్ చాలా బావున్నాయండీ .

krishna rao jallipalli చెప్పారు...

ఇపుడు ఆ నవ్వులన్నీ అటకెక్కాయి. అటక మీద మిఠాయి పొట్లం తియ్యాలంటే సుమన్ రావాల్సిందే ...,,,కూడా ప్రభాకర్ ఉంటేనే మజా. నిజం ఇప్పుడు etv కామెడీలు లేక వేళ వేళ పోతోంది. ఆ చిన్ని కృష్ణుడు, వెంకన్న స్వామి మనందరి మొర ఎప్పుడు ఆలకిస్తారో. ఎందుకంటే వారిద్దరమీదే కదా సుమన్ అంకుల్ అన్ని వేషాలు వేసి పాటలు పాడింది. నిజంగా వీరిద్దరికీ ఏ మాత్రం దయ దాక్షిణ్యం, కృతజ్ఞత లేవు సుమనుంకుల్ మీద. చక్కగా పోగిడించుకున్న కాలం పోగిడించుకొని ఇప్పుడు కాం అయిపోయారు. కలి కాలం మరి.

|| వాణి || చెప్పారు...

ప్రఫుల్ల చంద్ర గారు
ఎపుడైనా సుమన్ నా బ్లాగు చూస్తే ;-) బాగోదుగా...‘అతి’ సీరియల్స్ కు ‘అతి’ మర్యాద అందుకే ‘గారు’లు వండి వడ్డించాల్సోచ్చింది :-(

మనోహర్ గారు
ఈ-టి.విలో సుమన్ గారు వద్దులెండి :-( వేరే ఛానల్ ఏదైనా పెడితే రోజూ సీరియల్స్ చూడచ్చు.

సుజాత గారు
"విధి" వక్రించి "జీవితం" "పద్మవ్యూహం" అని భలే రాసారండి.. పాట బాగా గుర్తుపెట్టుకున్నారండి....
నా అంతట నేను ఈ టపాను పంపించను... సుమన్ గారు తనంతట తానుగా ఈ టపాను చూస్తే నా పూచి కాదు ;-)

పరిమళం గారు
మీరు కూడా స్మైలీలు టపా మధ్యలో పెట్టాలంటే http://ayushmanbhava.blogspot.com/2009/01/yahoo-emotions.html
ఈ లింకు చూడండి.

కృష్ణారావు గారు
సుమన్ గారు మీకు బంధువులావుతారా? అంకుల్ అంటున్నారు... దయచేసి ఈ టపా సంగతి చెప్పకండి. Plz :-(
అయినా పాపం ప్రాస పొగడ్తలకు ఆ చిన్ని కృష్ణుడు, వెంకన్న స్వామిలకు కూడా విరక్తి వచ్చి ఇలా జరిగిందేమో !!!!

సుజాత చెప్పారు...

కృష్ణా రావు గారు,
పాపం ఆ వెన్న దొంగకు, వెంకన్నకు (సుమన్ వేసిన వారి వేషాలు...అదే అవతారాలు చూసి)విరక్తి పుట్టే సుమన్ విధి వక్రించిందేమో!

వాణి గారు,
ఇంతకు ముందు బ్లాగుల్లోనే ఎవరో ఇలా ప్రాస రాశారండి. అది గుర్తొచ్చి రాశాను. నా సొంతం కాదు.

ఓపెన్ జగత్ చెప్పారు...

మా సుమన్ గారిని వెక్కిరించేస్తున్నారు.. ఇదేమైనా న్యాయంగా ఉందా.. "లా" తో లాగి లాగి అంత్య ప్రాసను తన కావ్య ఝరితో రంగరించి మా అమ్మమ్మ కన్నీటిలో కలిపి ప్రవహింపజేసిన గొప్ప వ్యక్తి ఆయన.. నా చిట్టి చెల్లి తన ఆరేళ్ళ వయసులో "పద్మవ్యూహం" లో చిక్కుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.. ఎందుకు ఏడ్చిందో కూడా తెలియనంత గొప్ప వ్యూహాన్ని అందించిన సుమన్ గారి గురించా మీరు ఇలా మాట్లాడుతున్నారు..

హత "విధీ"...

krishna rao jallipalli చెప్పారు...

సుమనంకుల్ - ఓంకార్ బాబాయ్. వీరందర్కీ చుట్టాలే. సుమనంకుల్... TV రంగంలో ఒక క్రొత్త వొరవడిని సృష్టించాడు. ఏమిటంటే... ETV AWARDS. తను పౌరాణిక వేషాలు వేసాడు కాబట్టి తన కోసం ప్రత్యేకంగా 'ఉత్తమ పౌరాణిక నటుడు' (కేవలం తనకోసం) అనే అవార్డు ని ప్రవేశ పెట్టి తనకి తనే ఇచ్చేసుకున్నాడు. (బ్లాగ్లర్లలో కొంతమంది .. నేను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని, నాకు చాలా విద్యలోచ్చు, నేను ఒక సంచలన రచయితను, నేను ఒక చరిత్రను సృష్టించాను, అని తమ తమ PROFILES లోను, టపాల లోను రాసుకుంటారు (డబ్బా కొట్టుకోవడం) చూడండి.. అలాగన్న మాట). మన అదృష్టమో, దురదృష్టమో కాని ... ముందు ముందు ఆయన వేయబోయే వేషాలు .. అంటే.. పిట్టల దొర, అత్తరు సాయబు, బుడబుక్కల వాడు, జంగం దేవర, సర్కస్ బఫూన్, హరిదాసు, గంగిరేద్దోడు.. ఇటువంటి వేషాలన్నీ మిస్సయ్యాము.. ఎం చేస్తాం మన ఖర్మ. ఎవరికి యెంత ప్రాప్తమో అంతే ప్రాప్తం. ఓ పని చేస్తే బావుంటుందేమో అందరూ ఆలోచించండి. ఏమిటంటే మనమంతా ... సుమన్ ఫన్సుమి అన్నమాట.. మహా సుమనా ప్రభ యాగం చేస్తే... వారు మరల మనందర్నీ ఆలరిస్తారేమో.

మధుర వాణి చెప్పారు...

భలేగా చెప్పారండీ. బాగుంది మీ టపా..!
ఈ మధ్యనే పాపం జనాలు కాస్త ఈటీవీ చూస్తున్నట్టు చెప్తున్నారు.
సుమన్ గారు మళ్ళీ రావడం కంటే వేరే చానల్ పెట్టడమే బెటరేమో.. ఆయన ఫాన్స్ ఫాలో అవ్వడం కోసం :))

సుజాత చెప్పారు...

కృష్ణా రావు గారు,
పదండి, యాగం ఏర్పాట్లు చూద్దాం! ఎన్ని రోజులని ఇలా కామెడీ లేకుండా నిస్సారంగా గడపాలి రోజులు?

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

మా చిన్నపుడు టి.వి.

మా చిన్నపుడు మా వీధిలో ఒక ఇంట్లోవారు టి.వి. కొన్నారు. అప్పటివరకూ రేడియోను విన్న జనాలకు టి.వి. చూడటం అదో అద్భుతం. ఇక మా వీధిలో ఆ టి.వి. ఉన్న ఇంటివాళ్ళు ఓ వెలుగు వెలిగారు. తెగ పోజులు కొట్టేవాళ్ళు. ఇక ఆదివారం వస్తే చాలు సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే సినిమాకోసం దీపం చుట్టూ పురుగుల్లా మా వీధిలో జనాలంతా ఆ ఇంట్లో చేరిపోయేవారు. మా పిల్లలం మాత్రం సినిమా 4 గంటలకైతే 3 గంటలకే ఆ ఇంటిముందు కాపు కాసేవాళ్ళం ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లో మాకు కూర్చోడానికి స్థలం దొరకదు కదా!!

ఆ ఇంటి పిల్ల దెయ్యాలతో మా వీధి పిల్లలం ఆడేటపుడు మాత్రం తెగ చిక్కు వచ్చేది. ఎందుకంటే ఆటలో వాళ్ళను గెలవనివ్వాలి లేదంటే మిమ్మల్ని టి.వి. చూడటానికి రానివ్వం అని బెదిరించేవాళ్ళు. మనసులో తిట్టుకున్నా బయటకు మాత్రం అందరం వాళ్ళతో తెచ్చిపెట్టుకున్న స్నేహం వెలగబోసేవాళ్ళం.

ఇక ఆదివారం ఉదయం హిందీ పాటలు రంగోలి, రామాయణం తర్వాత కార్టూన్స్ వాటిలో నాకు గుర్తు ఉన్నది జంగిల్ బుక్, స్పైడర్ మ్యాన్.... రామాయణం ప్రభావంతో కొబ్బరి చీపురు పుల్లలు తీసుకొని ఒక పుల్లను విల్లులాగా ఇంక మిగిలిన పుల్లలు బాణాలన్నమాట.. దాంట్లో వచ్చే సౌండ్ ఎపెక్ట్స్ అన్నీ మా నోటితో చేసేవాళ్ళం ఆ ఆ ఆ ఆ.... డిష్క్యాం డిష్క్యాం ... జుప్ జుప్ ఆ ఆ ఆ ఆ జప్ జప్ .... బూమ్ బూమ్...

ఇంక గురువారం వస్తే చిత్రలహరి... ఆ గురువారం చూసిన పాటలు మళ్ళీ గురువారం వరకూ పాడుకునేవాళ్ళం. ఆదివారం సినిమా చూసి మరుసటి రోజు స్కూలుకు వెళ్ళాక స్నేహితులతో ఆ సినిమాలోని జోక్స్, పాటలు అన్నీ ముచ్చటించుకునేవాళ్ళం. దూరదర్శన్ లో యాంకర్స్ మాకు దేవతల్లా కనిపించేవాళ్ళు. అప్పట్లో వారానికొకసారి వచ్చే (రోజుకొక సీరియల్ చొప్పున) సీరియల్స్ ను అపురూపంగా చూసేవాళ్ళం. నాకు గుర్తున్నంత వరకూ మహా అయితే 14 నుంచి 25 భాగాలు మాత్రమే ఉండేవి. కానీ ఇపుడు సీరియల్స్ 1000, 2000 మీ కళ్ళు పుళ్ళయ్యే వరకూ చూసుకోండి అన్నట్లు...

అప్పట్లో దూరదర్శన్ లో కిట్టిగాడు, హిమబిందు, ఆనందోబ్రహ్మా, ఇంక ఏవో మాయల మంత్రాల సీరియల్స్ వచ్చేవి పేర్లు గుర్తులేవు. ఒక మాయలు, మంత్రాలు ఉన్న సీరియల్ లో అయితే ఇద్దరు మనుష్యులు ఓ రకమైన పద్ధతిలో చేతులు కలపి కరచాలనం చేసుకొని ‘‘లాబాజిబాబా’’ అంటూ ఓ మంత్రం లాంటిది ఏదో చెప్పేవాళ్ళు. మా పిల్లలం స్కూల్లో, ఇంటి దగ్గరం ప్రెంఢ్స్ మి కలసి తెగ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేము కలిసినపుడు అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చుకొనేవాళ్ళం. చెప్పాలంటే దాదాపు సినిమాలో సీరియల్ లో ఇలాంటివన్నీ అనుకరించేవాళ్ళం.

వారం వరకూ వెయిట్ చేసి చూసే సీరియల్స్ కానీ, పాటలు కానీ, సినిమా కానీయండి ఎంతో థ్రిల్లింగ్..గా అనిపించేది. కానీ ఇపుడు వంద ఛానల్స్... మన చేతిలో ఉన్న రిమోట్ మన కళ్లను ఏ ఛానల్ సరిగ్గా చూడనివ్వదు. రోజూ సినిమాలు.... చూసినవే చూసి విసుగు.. సీరియల్స్ సంగతి చెప్పక్కరలేదనుకోండి. టి.వి. కోసమైన అందరం కలిసేవాళ్ళం. ఇపుడు ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి టి.వి వాళ్ళది. ఆఖరికి చిన్న పూరిపాకల్లో కూడా పెద్ద పెద్ద కలర్ టి.వి.లు.

అప్పట్లో శివరాత్రికి ఏవైనా భక్తి సినిమాలు వేసేవాళ్ళు... ఇపుడు రకరకాల ఛానల్స్ వాళ్ళు వేసే కొత్త సినిమాల కోసం జనాలు జాగారాలు చేస్తున్నారు. ఇపుడు అంత దృశ్యం కూడా లేదు సినిమా రిలీజ్ కు ముందే డివిడిలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత ఉన్నా అప్పటి ఆ కళ ఇపుడు కల మాత్రమే.

వచ్చిన వ్యాఖ్యలు :

27 comments:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

లబజిబాబా అని మేము కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళం( సీరియల్ పేరు గుర్తు లేదు కాని పొట్టీ వీరయ్య ఉండేవాడు ఆ సీరియల్లో ). కాశీమజిలి కథలు అప్పుడు వచ్చేవనుకుంటాను. చిత్రలహరి శుక్రవారం కదా.... గురువారం అని వ్రాసారు..

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

మొదట గురువారమే ఉండేది... తర్వాత శుక్రవారానికి మార్చారండి

subhadra చెప్పారు...

baagudi,
jabulu-javabulu kuda chusevallam.
oleti parvatisam,sudharani,santiswaroop,
vijayarani,vartalu chadive latha.....patalu pade ramachari..... chinna serial lo devadas kanakala family
meru anna pilladeyyalu bhusa naku vartistudemo ma intlo t.v undedi.
1985 lo maa tatagaru konnaru.
kani yappudu aatalalo
yemi wrong game aadinatlu gurutu ledu.
ainaa adugutaa naa chinnapati friends..

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

సుభద్ర గారు
చాలా ప్రోగ్రామ్స్ గుర్తు చేసారు. నేను మర్చిపోయాను. యాంకర్స్ కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు. శాంతిస్వరూప్ ఒకరే గుర్తున్నారు. మిగిలిన వాళ్ళ ముఖాలు గుర్తున్నాయి కానీ... పేర్లు గుర్తులేవు...

సిరిసిరిమువ్వ చెప్పారు...

1982 లో అనుకుంటా ఆసియా గేంసు జరుగుతున్నప్పుడు మా ఊరికే కాదు చుట్టుపక్కల నాలుగు వూళ్లకి మొదటిసారిగా మా ఇంట్లో టి.వి కొన్నారు.

ఆదివారాలు సినిమా టైంకి మా ఇల్లు పట్టేది కాదు..మేము సినిమా చూసేది వుండేది కాదు:). ఎందుకొచ్చిన టి.వి రా బాబూ అనిపించేది.

ఇందిరాగాంధి చనిపోయినప్పుడైతే ఏకంగా టి.వి బయట దొడ్డి మీద పెట్టాల్సి వచ్చింది-అంతమంది జనం.

చదువరి చెప్పారు...

ఆ మాయల సీరియల్లోనేననుకుంటా.. పేర్లు భలే వింతగా ఉండేవి - మిత్రాంద్ర అనేదొకటి నాకు గుర్తుంది. పుచ్చా ఇంటిపేరుగల నటుడు ఉండేవాడందులో. (పుచ్చా పూర్ణానందం కాదు, కుర్రవాడే!)

సీనుగాడు చెప్పారు...

లబజిబాబా అనే మాట.. "ఇది ఎక్క్డైన ఉందా??" అనే సీరియల్ లో వాడినారు

ఇట్లు
సీనుగాడు

నేస్తం చెప్పారు...

abbaa mee tapaa inkaa vaakyalu chaduvutunte malli aa rojulaloki vellipoyaa.. vijayalaxmi gaaru santhswaroop chellelu anevaaru.. enta varaku nijamo :)

krishna rao jallipalli చెప్పారు...

ఆస్తాన్ విద్వాంసుడు సుధీర్ కుమార్ని మర్చి పోయారు.

రాధిక చెప్పారు...

అరె మెము కూడా లాబాజీబాబా ని అనుకరించినవాళ్ళమే.అలాగే డామిట్ కధ అడ్డం తిరిగింది,కిట్టిగాడు,విచిత్ర కాశీ మజిలీ కధలు నాకు ఇష్టమైన సీరియల్స్.బధిరుల వార్తల ను ఎంతగా అనుకరించేవాళ్ళమో.ఆదివారం మధ్యాహ్నం వచ్చే వేరే భాషా చిత్రాలు కూడా బాగా చూసేవాళ్ళం.రామాయణం,భారతం అయితే మా చిన్నాన్నగారి ఇల్లు కిట కిటలాడిపోయేది.ఆదివారం టీవీ తెచ్చి వాకిట్లో పెట్టేవారు.ఆ దూరదర్శన్ పుణ్యమా అని నాచేత అన్ని హిందీ పరీక్షలు కట్టించేసారు మావాళ్ళు.

శ్రీ చెప్పారు...

మా ఊర్లో అయితే అందరూ చందాలు వేసుకుని "మా టీవీ" అని ఒక క్రౌన్ టీవీ కొని పెట్టారు.చిత్రలహరి కి ఊర్లో వాళ్ళు గుంపులు,గుంపులుగా వెళ్ళి చూసేవాళ్ళం.తమిళ్ పాటలు "ఒళియం ఒళియం" కూడా చూసేవాళ్ళం. ఉదయం పూట క్రికెట్ పెట్టేవాళ్ళు, అసలు ఏమీ కనిపించేది కాదు.

HAREPHALA చెప్పారు...

మీరు టీ వీ కొనుక్కున్న వాళ్ళ పాట్లు వ్రాయలేదు.నేను పూనా లో ఫాక్టరీ క్వార్టర్స్ లో ఉండగా డభై అయిదు లో టీవీ మొట్టమొదట కొన్న అభాగ్యులలో ఒకడిని.మేము పడ్డ పాట్లు పగవాడికి కూడా వద్దు.

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

సిరిసిరిమువ్వగారు
టి.వి ఉన్నవాళ్ళ కష్టాలు ఒకలాంటివైతే, టి.వి లేని కష్టాలు ఒకలాంటివి.

చదువరిగారు
పుచ్చారామకృష్ణ

సీనుగాడు గారు
అవును సీరియల్ లోనే వాడారు.

నేస్తం గారు
విజయలక్ష్మీ గారిని శాంతిస్వరూప్ చెల్లెలు అనేవారు. కానీ ఇప్పటికీ నా వరకు సస్పెన్సే.

కృష్ణారావు గారు
సుధీర్ కుమార్ ఎవరో గుర్తులేదు అసలు :-(

రాధిక గారు, శ్రీ గారు :-)

HAREPHALA గారు
మేము టి.వి. కొన్నాక పాపం టి.వి ఉన్నవాళ్ళ పాట్లు అర్ధమయ్యాయండి... టి.వి చూడటానికి రానియ్యకపోతే పాపం వాళ్ళని బాగా తిట్టుకొనేవాళ్లం కానీ.... తర్వాత వాళ్ళ బాధలు అర్ధమయ్యాయి. మనసులో సారీలు చెప్పుకున్నా...

చక్రవర్తి చెప్పారు...

చిత్రహార్ అని హిందీ పాటల కార్యక్రమం బుధవారం వచ్చేది అలాగే చిత్రలహరి అని తెలుగు పాటల కార్యక్రమం వచ్చేది. నాకు బాగా గుర్తు, ఇలా సినిమా చూస్తూ ముందు వరుసలో కూర్చొని నిద్రపోయ్యేవాడిని.

ఇలా వాళ్ళింట్లో వాళింట్లో నిద్రపోతున్నానని మా అమ్మ ఎలాగోలా కష్టపడి మా ఇంట్లోకి కూడ టీవి కొని తెచ్చింది. అదిగో ఇంకే, మా సందులో మేమూ గొప్పోళ్ళం అయ్యిపోయ్యాము.

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

చక్రవర్తిగారు
నేను చాలావరకూ మర్చిపోయాను. టపా రాయడం వల్ల బ్లాగర్లందరూ చాలా మంచి జ్ఞాపకాలు, ప్రోగ్రామ్స్ గుర్తు చేసారు. అప్పట్లో హింది రాకపోయినా హింది పాటలు, సినిమాలు కూడా చూసేవాళ్ళం.

రవిగారు చెప్పారు...

అప్పట్లో ఎవరైనా జాతీయ నాయకులు పొతే జనాలంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చే వారు.వాళ్ళు పోయినందుకు కాదు . టీవీ లో వోఇలేన్ పట్టుకుని ఒక గంట వాయించాక , ఇంకో ముల్లా ఎవరో వచ్చి ఖురాన్ లో సూక్తులు మొత్తం ప్రొగ్రమ్మెస్ అన్ని కాన్సిల్ చిత్రలహరి, సినమా లతో సహా. ఇంక శాంతి స్వరూప్ అయితే వాళ్ళ ఇంట్లో సొంత భంధువులు పోయినట్టు గొంతులో భాధ ని పలికిన్చేవాళ్ళు. ఇంక రాత్రి కరెక్ట్ గా భోజనాలు చేసే టైం కి పాలు చేలు అన్న కార్యక్రమలో గేదె పేడని ఎరువులు గా ఎలా వాడుకోవచ్చో చూపేవారు..విజయ దుర్గ పెద్ద పెద్ద కొప్పులు పెట్టుకుని మరి వచ్చేవారు.ఇంక విజయలక్ష్మి గారు శాంతి స్వరూప్ భార్య.ఇవన్ని గుర్తు చేసినందుకు మీకు ఆయుష్మాన్ భవ.

|| వాణి || చెప్పారు...

ఓహ్ రవిగారు
చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసారు. అపుడు మేము పిల్లలం కదా!! నిజంగానే ప్రోగ్రామ్స్ ఏమీ రాక అల్లాడేవాళ్ళం... పైగా ఓ విషాదమైన మ్యూజిక్ పెట్టేవాళ్ళు...

boss చెప్పారు...

naku patha rojula teepi gnapakau ochaiandi.....thank u

నేను చెప్పారు...

"ఇంత ఉన్నా అప్పటి ఆ కళ ఇపుడు కల మాత్రమే"
అప్పట్లో ప్రేమికుడులో పాటలో అంటారు "చిత్రలహరిలొ కరంటు పోతే ...take it easy policy" అని దాని బట్టి మన చిత్రలహరి ఎంత గొప్పదో కదా ... :)

Manohar చెప్పారు...

kittigadu chala bagundedi. ruthuragalu vachchevaraku anni 13 bhagaale undevi, mamulu serials.
okka sri krishna tappithe

జయ్ చెప్పారు...

ఇందిరా గాంధీ పోయినప్పుడు నేను నర్సరీలో ఉన్నాననుకుంటాను.. ఇందిరా గాంధీ పోయిన దృశ్యాలను చూడడం కోసమే మా మామయ్య టి.వి. కొన్నారు. ౩ రోజుల విశాద సంగీతం ముగిసాక, మా సాడిష్టు చిన్న మామయ్య ప్రతీ శనీ ఆది వారాలలో వచ్చే దయ్యాల సినిమాలు తిట్టి మరీ చూపించేవారు. ఆయన పుణ్యమా ఇప్పుడు దేవుళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేశాను.. మా అమ్మమ్మ సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.. ఏ భాష సినిమా వేసినా నవ్వుకుంటూ చూసేవారు, ఆఖరుకు సినిమాలో విలన్ ఏడ్చినా కూడా ఏడ్చేవారు... ఏంటో.. అప్పుడు మా అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక, నేను కూడా ఏడ్పందుకునే వాన్ని...

చిన్న పిల్లాన్ని కదా మరి అప్పుడు... :)

సుజాత చెప్పారు...

చదువరి గారు,
అతడి పేరు పుచ్చా రామకృష్ణ! ఆ మంత్రాల సీరియల్ కి ఇంత ఫాలోయింగ్ ఉండేదన్నమాట. ఇక్కడ అందరూ దాని ఫాన్సే ఉన్నారు.

కృష్ణా రావు గారు చెప్పినట్లు సుధీర్ కుమార్ గార్ని మర్చిపోయారు. ఆయన ఆ తర్వాత తులసి దళం అనే సీరియల్లో కూడా నటించాడు.

మా ఇంట్లో కూడా ఇదే తంతు! పైగా మా ఇంట్లో ఒక కొసరు పోర్టబుల్ టీవీ ఉండేది. దాన్ని బాటరీతో నడిపించే ఏర్పాటు. క్రికెట్ మాచ్ లప్పుడు కరెంట్ పోతే మా ఇంట్లో తిరణాలే! అందరూ మా ఇంట్లోనే! పైగా బాటరీ కూడా సొంత డబ్బుతో జోజి మైక్ సెట్టింగ్ వాళ్ల దగ్గర ఛార్జింగ్ పెట్టించడానికి కుర్రళ్లంతా రెడీ అయ్యేవాళ్ళు. ఇంట్లోకి వెళ్ళాలంటే సందులోంచి తిరిగి పెరటి దోవకుండా వెళ్ళాల్సి వచ్చేది.

ఆ హిమబిందు అమ్మాయి ఏమైపోయిందో, ఆ సీరియలే మొదలు, చివర! ఆ సీరియల్ తోనే గుండు హనుమంత రావు పరిచయం అయ్యాడు.

రాధిక చెప్పిన "డామిట్..." సీరియల్ కూడా స్టూడెంట్స్ కథతో బాగుండేది.

రాస్తుంటే ఇంకా వస్తూనే ఉంటాయి జ్ఞాపకాలు. ఇక చాలిస్తా!

దూరదర్శన్ పుణ్యమా అని హిందీ అంటే ఉన్న భయం పోయి మాట్లాడేంత ఫ్లూయెన్సీ వచ్చేసింది.

రవిగారు,శాంతి స్వరూప్ భార్య పేరు రోజా రాణి అండి, విజయలక్ష్మి కాదు.

చదువరి చెప్పారు...

ఔనౌను, పుచ్చా రామకృష్ణ! శ్శ్..శ్శ్..శ్శ్ అంటూ నవ్వేవాడు ఆ పాత్రలో! :)

krishna rao jallipalli చెప్పారు...

దూరదర్శన్ అప్పట్లో అందరకి నవ్వుల్ని పంచేది.. అన్ని రకాలుగా. శాంతిస్వరూప్: వార్తలు చదివే ఆస్థాన విద్వాంసుడు. మాటలని నిన్చోపెట్టి, పడుకోబెట్టి, వొంగోబెట్టి, విరగాకొట్టి చదివేవారు. కూర్చోవడంకూడా ... ఏ మాత్రం చలనం లేకుండా, ఒక విగ్రహంలా కూర్చొనే వారు. అదో స్టైలూ....
2. వోలేటి పార్వతీశం... వీరు కూడా ఆస్థాన విద్వాన్సుడే. జాబులు జవాబులు కార్యక్రమంలో పొగడ్తల ఉత్తరాలు 90 ఉంటే వాటన్నిటికి చక్కగా మరీ విడమర్చి జవాబులు చెప్పే వారు. విమర్శల ఉత్తరాలు కేవలం ఒకటో రెండో చదివే వారు. దానికి వారి జవాబులు ఎంతో సమయస్ఫూర్తితో అది ఒకటి రెండు పదాలతో జవాబులు ఇచ్చే వారు. దాటవెయడంలో ఘనాపాటి .
3. సుధీర్ కుమార్... ఆస్థాన సంగీత విద్వాంసుడు. తరువాత్తరువాత నాటికలు, సీరియల్స్ లో నటించే వారు. (కొత్తవారికి చోటిచ్చే ప్రసక్తి లేదు).
4. రోజా రాణి.. ఆస్థాన announcer. అందంగా ఉండి అందర్ని ఆకట్టుకొనే వారు.
WORLD RECORD: సిని నటి నిర్మలమ్మ నటించిన పోరాటం అనే నాటికని .. ఏ ప్రోగ్రాములు లేకపోతె.. కొన్ని వందల సార్లు ప్రసారం చేసారు. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు.
INDIA RECORD: జేబుల్లేని చొక్కా అనే ఒక భయంకర హాస్య (అని మనము అనుకోవాలి) నాటికను ప్రసారం చేసి తెలుగు దూరదర్శన్ ఒక రికార్డుని నెలకొల్పింది. (దీనిని అంబిక అగర్బత్తి వారు స్పొంసార్ చేసారు. నేను వారికి ఒక ఉత్తరం రాసాను.. మేరు కనుక ముందు ముందు ఇటువంటి భయంకరమైన నాటికలను స్పొంసార్ చేస్తే... మీ అగర్బత్తిలను కొనను అని)
ఇంకా ఎన్నో ఎన్నో కామెడి జ్ఞాపకాలు... తలచుకొంటే భలే సరదాగా ఉంటాయి. కొన్ని కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటే.. ప్రోగ్రాములు ఇలా ఉండకూడదు అనే ప్రామాణికాలు నెలకొల్పిన ఘనత దూరధర్శన్కే దక్కుతోంది. (OUT OF PLACE అని అనుకోపోతే... ఈ విషయం కొన్ని కొన్ని బ్లాగులకు కూడా వర్తిస్తుంది)
ఇక శెలవా మరి.

|| వాణి || చెప్పారు...

కృష్ణారావు గారు
మీరు చాలా మంది పేర్లను గుర్తు చేసారు. ఇక అంబికా వాళ్ళ సంగతికొస్తే పాపం అపుడు మహావృక్షం దూరదర్శనే కాబట్టి... స్పాంసర్ చేసుంటారు. ఇపుడు అలా చెయ్యరులెండి.. lol. పాపం అలా బెదిరిస్తే ఎలాగండీ...
ఇది వరకూ మేము టెలీస్కూల్ బాగా చూసేవాళ్ళం. మొన్నామధ్య ఎందుకో ఏదైనా మార్పులు వచ్చాయేమో అని చూస్తే... అప్పటి కార్యక్రమాలే ప్రసారం చేస్తున్నారు...
బ్లాగుల విషయంలో నాకు కూడా అపుడపుడు అలానే అనిపిస్తుంది... కానీ నాకు ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది... ఎవరిగోల వాళ్ళదే...

Muvva చెప్పారు...

appatlo Achyuth, Shilpa dooradarshan hero and heroines ga vunde vallu. baga alarinchindi.. paramanandayya gari shishula katha. alage Guinnies book of world records kuda serial ga vachedi. sat'day roju... news break lo dinner complete chesi..migatha 10 mins cinema chuse vallamu.

*chala sarlu.. "Antha rayaniki chintustunnamu " ani vachedi.

samarsimham చెప్పారు...

andhariki namaskaramandi, telugu typing ikkada leka english lo telugu type chesthunnam,idhi mana kahrma,oka vishayam andharu amrchi poyaru,thenaramalingadu(ashokkumar,ashok rao),anandhobraham(dharmavarapu) seriels chala bagundevi,alage paina cheppina serials mariyu programs chala bagundevi.aadivaram 9:00 ki lesthe rathri 9:00 varaku asalu doordarshan mundhara nundi leche vallam kaadu.aa paatha gnapakaalu ippatiki gurte.thanks for all

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments